పంటచేను వద్ద జరిగిన ఘర్షణ ముగ్గురి దారుణ హత్యకు దారి తీసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో రెండు కుటుంబాలు పత్తిచేల వద్ద ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో గొడ్డళ్లతో దాడికి పాల్పడి ముగ్గురిని ప్రత్యర్థి వర్గీయులు దారుణంగా నరికి చంపారు. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినవారు ఒకే కుటుంబానికి చెందిన తండ్రి లావుడ్యా మంజూ నాయక్, కుమారులు సారయ్య, భాస్కర్ లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.