హనుమాన్ భక్తులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు కీలక సూచన చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులెవరూ కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి రావద్దని మహదేవపూర్ పోలీసులు ప్రకటించారు. మహదేవపూర్ సీఐ టి. కిరణ్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలను గురువారం సందర్శించారు. అనంతరం మహదేవపూర్ బస్ స్టేషన్ లో వాహనాల తనిఖీ నిర్వహించి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ మాట్లాడుతూ, హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుని భక్తులెవరూ మాల విరమణ కోసం కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి రావద్దన్నారు. కాళేశ్వరం గ్రామాన్ని కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించినట్లు చెప్పారు. అందువల్ల బయటి వ్యక్తులెవరూ కాళేశ్వరం సందర్శనకు రావద్దని, ఒకవేళ వచ్చినట్లయితే వారిపై లాక్ డౌన్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు