ఖమ్మం నగరంలోని పది ప్రయివేట్ ఆసుపత్రుల కోవిడ్ చికిత్సా లైసెన్సులను రద్దు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించిన నగరంలోని 10 ప్రవేటు ఆసుపత్రులకు కోవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఖమ్మం నగరంలోని విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్యూర్ హాస్పిటల్, ప్రశాంతి హాస్పిటల్స్, మార్వెల్, జనని చిల్డ్రన్ హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ బాలాజీ చెస్ట్, డయాబేటాలాజి సెంటర్, న్యూ హోప్ హాస్పిటల్, సంకల్ప సి స్టార్ హాస్పిటల్ కోవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసినట్లు చెప్పారు. ఆయా 10 ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ సేవలను అందించడంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు టాస్క్ ఫోర్స్ బృందం నిర్దారించిందని, అందువల్ల ఆయా హాస్పిటల్స్ కు జారీ చేసిన కోవిడ్ సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మాలతి వివరించారు.