రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ వైపు మొగ్గు చూపింది. మంగళవారం రాత్రి నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈనెల 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాస్పిటల్స్, మెడికల్ షాపులు, ల్యాబ్ లకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటల వరకే షాపులు, హోటళ్లు, ఆఫీసులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వును దిగువన చూడవచ్చు.