తెలంగాణా సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యాన్ని డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. సీఎం ఐసొలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించినట్లు, ఆమేరకు ఆయన ఫాం హౌజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు.