కరోనా మహమ్మారి ఓ పోలీసు అధికారిని పొట్టన పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో సీసీఎస్ డీఎస్పీగా పనిచేస్తున్న జుత్తు పాపారావు కరోనాతో మరణించారు. విశాఖలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. డీఎస్పీ పాపారావును కరోనా కబలించిన ఘటన ఏపీ పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.