తెలంగాణాలో కరోనా మహమ్మారి తాజా స్థితిపై ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలలోని కరోనా పరిస్థితులు, పరిణామాలపై పలు అంశాలను వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు తెలంగాణాలో 4,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనాపై డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
- దేశంలో కరోనా పరిస్థితులు గంభీరంగా ఉన్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది.
- నిన్న లక్ష 26 వేల టెస్టులు చేశాం, 5వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- కరోనా వైరస్ లో మ్యుటేషన్స్ చాలా ఉన్నాయి.
- అమెరికా- ఇంగ్లండ్- బ్రెజిల్ దేశాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.
- కరోనా చేయిదాటి పోతే తట్టుకునే పరిస్థితి దేశానికి లేదు.
- స్పానిష్ వ్యాధి వల్ల 50 లక్షల మంది అప్పట్లోనే మృతి చెందారు.
- కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం ముప్పు ఉంది.
- స్పానిష్ వ్యాధి రెండో సారి వచ్చినప్పుడు 7 కోట్ల మంది మృతిచెందారు.
- మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉత్సవం చేసుకోవడం వల్ల 400కు పైగా కేసులు నమోదు అయ్యాయి.
- కరోనా సెంకండ్ వేవ్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్నది.
- కరోనా వైరస్ లో డబుల్ మ్యుటేషన్స్ వచ్చాయి.
- ప్రస్తుతం తెలంగాణలో రోజులు లక్ష 25 వేల టెస్టులు చేస్తున్నాము.
- టెస్టుల సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాం.
- రాష్ట్రంలో సెప్టెంబర్ లో 18 వేలు మాత్రమే ఉండేవి- అప్పుడు 40 శాతం మాత్రమే వాడుకున్నాము.
- ప్రస్తుతం 53 వేల బెడ్స్ అందుబాటులో అన్ని హాస్పిటల్స్ కలిపి ఉన్నాయి.
- 116 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండగా, హైదరాబాద్ లో 5 హాస్పిటల్స్ కోవిడ్ కోసం.
- ప్రైవేట్- ప్రభుత్వం హాస్పిటల్స్ బెడ్స్ కొరత లేదు.
- కరోనా వచ్చిన వారిలో 80 శాతం వారికి లక్షణాలు లేవు.
- 12 శాతం మంది రోగులకు మాత్రమే కొంత సీరియస్ ఉంది.
- మందులు- ఆక్సిజన్- వెంటిలేటర్ కొరత తెలంగాణ రాష్ట్రంలో లేదు.
- రెండిస్విర్ అనే మంది ముఖ్యమైనదేమీ కాదు- ఇప్పటికీ ఇది టెస్టింగ్ లోనే ఉంది.
- రాబోయే జూన్ వరకు ప్రభుత్వం చెప్పినట్లు ప్రజలు పాటించాలి.
- 1,300 సెంటర్లలో వ్యాక్సిన్ వేస్తున్నాం. గత రెండు రోజుల నుంచి కొరత కనిపిస్తోంది.
- 28 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఇందులో 25 లక్షల వరకు మొదటి డోస్ ఇచ్చాము.
- తెలంగాణ వ్యాక్సిన్ టార్గెట్ 25 శాతం రీచ్ అయ్యాం.
- సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి.
- ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే 104కి ఫోన్ చేసి చెప్పండి.
- అవసరం అయితే పెళ్లిళ్లు వాయిదా వేసుకోండి.
- కోవిడ్ కారణంగా నా తండ్రిని కోల్పోయిన బాధ నాకు తెలుసు.
- ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ అవసరం లేదు.
- లాక్ డౌన్ పెడితే కరోనా కంటే ఎక్కువ మరణాలు ఆకలితో ఉంటాయి.