గాంధీ ఆసుపత్రిలో ప్రతి పది నిమిషాలకు ఓ కరోనా పేషెంట్ చికిత్స కోసం చేరుతున్నట్లు తెలంగాణా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో గాంధీ ఆసుపత్రిని శనివారం నుంచి పూర్తి స్థాయి కరోనా చికిత్స ఆసుపత్రిగా మారుస్తున్నట్లు పేర్కొంది. అంతేగాక శనివారం నుంచి గాంధీ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు, కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే చికిత్స అందించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసిన ఉత్తర్వులో వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే 450కి పైగా పేషెంట్లు ఉన్నారని, ఐపీ బ్లాక్ మొత్తం ఇప్పటికే కరోనా రోగులతో నిండిపోయిందని, నిన్న ఒక్కరోజే 150 మంది చేరినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ చికిత్సా కేంద్రంగా మారుస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.