పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఏకం కావలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ మమతా బెనర్జీ పలువురు నాయకులకు లేఖలు రాశారు. ప్రధానంగా బీజేపీయేతర పార్టీలకు ఆమె లేఖలు రాస్తూ దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. రాజ్యాంగపైనా, ప్రజాస్వామ్యంపైనా బీజేపీ చేస్తున్న దాడులను సమర్థంగా ఎదుర్కుంనేందుకు బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరముందని మమతా బెనర్జీ అన్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కు, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, డీఎంకే అధినేత స్టాలిన్ కు, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కు, సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్ కు, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్ కు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. సీపీఎ, సీపీఐ పార్టీలను మాత్రం మమతా బెనర్జీ విస్మరించడం గమనార్హం. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపునకు సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని రాజకీయ పరిశీకులు అంటున్నారు.
ఫీచర్డ్ ఇమేజ్: ఫైల్ పొటో