భిక్షాటనలో ఇదో వెరైటీ. సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు చెంచు తెగకు చెందిన వెంకన్న. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన వెంకన్న భిక్షాటన చేస్తూ జీవిస్తుంటాడు. ధర్మం చెయ్యండి బాబూ… అని వెంకన్న మిమ్మల్ని అడగ్గానే… ఫో… ఫో… చిల్లర లేదు వెళ్ళు… అని మీరు ఈసడించుకున్నారనుకోండి. పోకిరి సినిమాలో ఆలీ పాత్ర లాగా మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టడు వెంకన్న. “ఏం ఫరవాలేదు బాబూ… జేబులో చిల్లర లేదా? అయితే ఫోన్ పే గాని, గూగుల్ పే గాని చేయండి” అంటూ QR కోడ్ బోర్డును ప్రదర్శిస్తాడు. స్కాన్ చేసి నా అకౌంట్ కు దానం చేయండి బాబూ… అని అభ్యర్థిస్తాడు. ఇప్పుడు చెప్పండి… భిక్షాటనలో వెంకన్న “టెక్నిక్” భలే అప్డేటెడ్ కదా!