దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం జరిగింది. సూరీడుపై అతని అల్లుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంట్లోకి ప్రవేశించిన అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నం చేశాడు.గతేడాది కూడా సూరీడిపై సురేంద్రనాథ్‌రెడ్డి దాడి చేశాడు. తన భార్యపై వేధింపుల ఆరోపణలపై గతంలో సురేంద్రనాథ్‌రెడ్డిపై గృహహింస కేసు నమోదు అయింది. తన కూతురును వేధిస్తున్నట్లు సురేంద్రనాథ్‌రెడ్డిపై సూరీడు కేసు పెట్టారు. ఆయా కేసు ఉపసంహరించుకోవాలని సూరీడిపై సురేంద్రనాథ్ ఒత్తిడి చేశాడని, కేసు ఉపసంహరించుకోవట్లేదన్న కక్షతో సూరీడిపై అల్లుడు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సూరీడు కుమార్తె ఫిర్యాదుతో సురేంద్రనాథ్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.