పోలీసులు ప్రయాణిస్తున్న బస్సును నక్సలైట్లు పేల్చడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లా కడెనార్, మండోడా అటవీ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన జరిగింది. నక్సల్స్ గాలింపు చర్యల కోసం బస్సులో ప్రయాణిస్తున్న పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టు నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) విభాగానికి చెందిను ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సందర్భంగా బస్సులో మొత్తం 15 మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన పోలీసులను రాయ్ పూర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనను ఛత్తీస్ గఢ్ డీజీపీ అవస్థీ ధృవీకరించారు.