నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈనెల 23వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 30వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన 31వ తేదీన చేస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు ఏప్రిల్ 3వ తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. తిరుపతి సహా దేశవ్యాప్తంగా రెండు పార్లమెంట్ సీట్లకు, 14 అసెంబ్లీ స్థానాలకు ఆయా తేదీల్లోనే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యుల్ ద్వారా ప్రకటించింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.