ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆకస్మిక వరదల కారణంగా 150 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మూడు మృతదేహాలను కనుగొన్నారు. మంచు చరియలు విరిగిపడిన ఫలితంగా ధౌలిగంగా నది అకస్మాత్తుగా ఉప్పొంగింది. అనూహ్యంగా పెద్ద ఎత్తున వరద రావడంతో పవర్‌ప్లాంట్ వద్ద మంచుచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద పవర్ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరింది.
భారీ వరద ధాటికి ఆనకట్ట కొట్టుకుపోయింది. వరద నీరు ప్రవేశించడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టులోని పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇండో-టిబెటిన్ సరిహద్దు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.