అధికార పార్టీ తరపున వకాల్తా పుచ్చుకునే పత్రికలు కాస్త సంయమనం పాటించాలి అంటుంటారు సీనియర్ జర్నలిస్టులు. అందుకు విరుద్ధంగా పరిణామాలు చోటు చేసుకున్నపుడు పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారుతుంటాయని కూడా విశ్లేషిస్తుంటారు. నిన్నటి ‘నమస్తే తెలంగాణా’ పత్రిక ప్రచురించిన వార్తా కథనం గుర్తుంది కదా? పీఆర్సీ సబ్జెక్టును తీసుకుని ‘జీ స్వప్న’ అనే పేరుతో తెలంగాణాలో అధికార పార్టీ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై నిన్నటి నుంచి టీచర్లు భగ్గుమంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆ పత్రిక ప్రతులను దహనం చేస్తున్న సంగతి తెలిసిందే.
‘నమస్తే…’ ప్రచురించిన ఆయా వార్తా కథనంలో తాాజా అంశమేమిటంటే…? కేవలం ప్రతులను దహనం చేయడమే కాదు.., సోషల్ మీడియా వేదికగానూ టీచర్లు ఆ పత్రిక తీరును తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయా పత్రికను, కథనం రాసిన రచయితను టార్గెట్ చేస్తూ కౌంటర్ కథనాలు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. కౌంటర్ కథనాల్లో వాడిన భాష మరీ బాగోలేదుగాని, కొన్ని పోస్టులను దిగువన చూడవచ్చు.