తెలంగాణాలో అధికార పార్టీ కరదీపికగా భావిస్తున్న ‘నమస్తే తెలంగాణా’ దినప్రతికపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సొమ్ము అందరిది.. సోకు కొందరిదా! శీర్షికన ఆ పత్రిక ఆదివారం నాటి సంచికలోని మూడో పేజీలో ప్రచురించిన ఓ కథనం టీచర్ల కోపానికి కారణమైంది. పీఆర్సీ అంశంపై ‘జీ స్వప్న’ పేరుతో ప్రచురించిన వ్యాసం లాంటి వార్తా కథనంపై రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు భగ్గుమంటున్నారు. మహబూబ్ నగర్, సిరిసిల్ల తదితర జిల్లాలో నమస్తే తెలంగాణా పత్రిక ప్రతులను టీచర్లు దహనం చేసినట్లు వార్తలు అందాయి. నమస్తే తెలంగాణా పత్రిక ప్రచురించిన ఆయా వార్తా కథనం తమను కించపరిచేదిగా ఉందని టీచర్లు నిరసనకు దిగి, ‘గుమస్తా తెలంగాణా’గా పత్రికగా అభివర్ణిస్తూ దాని ప్రతుల దహనం కార్యక్రమానికి పూనుకుంటున్నారు.