మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న మృతిపై ఆ పార్టీ గురువారం స్పష్టతనిచ్చింది. రామన్న చనిపోయిన మాట వాస్తవమేనని మావోయిస్టు పార్టీ మీడియా అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదలైన ఆడియో వెల్లడిస్తోంది.
రామన్న మావోయిస్టు పార్టీ నాయకునిగా పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోశారని, పేద ప్రజానీకాన్ని ఉద్యమ పోరాటాల వైపు మళ్లించడంలో రామన్న కృషి మరువలేనిదనే సారాంశంతో వికల్ప్ మాట్లాడారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU) నుంచి మావోయిస్టు పార్టీ అగ్ర నేతగా ఎదిగిన నేపథ్యాన్ని కూడా వికల్ప్ వివరించారు. రామన్న విప్లవ కార్యకలాపాలకు చేసిన కృషిని కూడా ఆయన ఈ సందర్బంగా కొనియాడారు. రామన్న మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు కూడా ప్రకటించారు. వికల్ప్ ప్రకటనతో రామన్న మృతిపై జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లుగానే పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్ గడ్ లోని ఓ ప్రముఖ హిందీ పత్రిక ప్రతినిధితో వికల్ప్ మాట్లాడిన ఆడియో క్లిప్ ts29.in కు అందింది. వికల్ప్ ఆడియో సంభాషణను ఈ దిగువన వినండి.