మావోయిస్టు నక్సలైట్ల గాలింపు చర్యలకోసం బయలుదేరిన పోలీసు బృందంలోని జవాన్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్తీస్ గఢ్ లో కలకలం సృష్టించింది. చింతగుఫా పోలీస్ స్టేషన్ కు చెందిన 206 బెటాలియన్ కోబ్రా పోలీసులు నక్సల్స్ ఏరివేతకోసం బయలుదేరారు. అయితే ఈ బృందం బయలుదేరిన సమయంలోనే అదే బెటాలియన్ కు చెందిన జవాన్ తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతున్ని పంజాబ్ లోని లూథియానాకు చెందిన హర్జీత్ సింగ్ గా సుక్మా ఎస్పీ కన్హయ్య లాల్ ధ్రువ్ చెప్పారు. ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో జవాన్లు నిరంతరం ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉదంతాలు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి.