తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించుకుంటారు. సీఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఆర్ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో, వాటిని గురువారం మధ్యాహ్నం ఆసుపత్రిలో నిర్వహించనున్నారు.