పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈమేరకు పశ్చిమ బెంగాల్ కు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని అసదుద్దీన్ గతంలోనే ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నాయకులతో సమావేశం ఫలప్రదంగా జరిగిందంటూ అసదుద్దీన్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.