‘బంగారు బొమ్మ రావేమే…పందిట్లొ పెళ్లి జరిగేనే…’ అనే పాట వినిపిస్తుండగా, చక్కగా ముస్తాబు చేసిన వధువును ముత్తయిదువలు పెళ్లి పందిట్లోకి తోడ్కొని రావడం ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పటి పిల్లలు ఎంచుకుంటున్న ట్రెండే వారే. ప్రి-వెడ్డింగ్ షూట్… అంటూ పెళ్లి వేడుకల్లో రకరకాల మార్పులు. ఇందులో భాగమే కావచ్చు…
అందరిలాగే ఆ వధువు కూడా పెళ్లి పందిట్లోకి అడుగిడి, తలదించుకుని, సిగ్గుపడుతూ వరుడిచేత మూడుముళ్లు వేయించుకుంటే బహుషా వార్తల్లోకి వచ్చేది కాదు. పెళ్లి పందిట్లోకి ఈ వధువు ఎంట్రీనే ఓ వెరయిటీ. కళ్లద్దాలు ధరించి, సంప్రదాయ చీరకట్టులో ‘మేరె సైయాన్ సూపర్ స్టార్..’ అంటూ బాలీవుడ్ హిట్ సాంగ్ కు అనుగుణంగా డాన్స్ చేస్తూ ఆ నవవధువు ఎంట్రీ ఇచ్చేసరికి అక్కడున్న బంధుగణమే కాదు, వరుడు సైతం ఫిదా అయ్యారు.
మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికూతురు ఇచ్చిన ఈ వెరయిటీ ఎంట్రీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు కాబోయే సతీమణి వెరయిటీ ఎంట్రీకి వరుడు ఎలా స్పందించాడన్నదే అసలు కొసమెరుపు. ఇక దిగువన గల వీడియోలో ఆ దృశ్యాన్ని తిలకించండి.