జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అనేక సర్వే సంస్థలు నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ గుర్తున్నాయ్ కదా! ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసుకుని టీఆర్ఎస్ నాయకులు, కేడర్ తెగ సంతోషపడిపోయారు. సహజంగానే బీజేపీ నేతలు కాస్త డీలా పడి ఉండవచ్చు. కానీ తమకు యాభై సీట్లు ఖాయమని బీజేపీ నాయకులు ‘ఆఫ్ ది రికార్డు’గా చెబుతూనే ఉన్నారనుకోండి. కానీ ts29 ఈ ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతను నిన్ననే సందేహించింది. ఓ దుబ్బాక ఉప ఎన్నిక ఉదంతాన్ని గుర్తు చేస్తూ వార్తా కథనాన్ని కూడా ప్రచురించింది. సందేహించినట్లే జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బొక్కబోర్లా పడ్డాయి.
ఇంతకీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నివేదికలు నిన్న చెప్పిందేమిటి? నేటి ఫలితాల్లో తేలిందేమిటి? ఎక్కువ విశ్లేషణ అక్కర లేదు. ఈ వార్త రాసే సమాయానికి అందిన సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను, నిన్నటి ఎగ్జిట్ పోల్ వివరాలను దిగువన గల పట్టికల్లో ఓసారి పరిశీలించండి.