మానవ రక్తం రుచి మరిగిన పులి తెలంగాణాలోని అటవీ ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి ఇప్పటికే ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. గడచిన పదిరోజుల వ్యవధిలోనే పులి దాడికి ఇద్దరు బలయ్యారు. ఫలితంగా ఆసిఫాబాద్ నుంచి మహబూబాబాద్ అడవుల వరకు స్థానిక అటవీ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారులు ఓ ప్రకటన తయారు చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. పులిని పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పకుండా, ప్రజలను హెచ్చరిస్తూ తయారు చేసిన ఆ ప్రకటన కథా కమామీషు ఏమిటో దిగువన మీరూ చదివేయండి మరి.