ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ దిశగా ప్రక్రియ సాగుతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిపాదిత పోలీసు యూనిట్ల జాబితాను రూపొందించిందా? ఔనని భావించేందుకు బలం చేకూరుస్తూ ఓ జాబితా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ‘ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకై 29 ప్రతిపాదిత పోలీసు యూనిట్లు’ శీర్షికన ఈ జాబితా ఉండడం గమనార్హం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సిటీ (కమిషనరేట్), పార్వతీపురం, అరకు, అనకాపల్లి, రంపచోడవరం, రాజమండ్రి (కమిషనరేట్), కాకినాడ (కమిషనరేట్), అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, విజయవాడ (కమిషనరేట్), గుంటూరు (కమిషనరేట్), నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు రూరల్, నెల్లూరు (కమిషనరేట్), తిరుపతి రూరల్, తిరుపతి (కమిషనరేట్), చిత్తూరు, రాజంపేట, కడప, హిందూపూర్, అనంతపురం, నంద్యాల, కర్నూలు కేంద్రాలుగా పోలీసు యూనిట్లను ప్రతిపాదించారు. అరకు హెడ్ క్వార్టర్ గా పాడేరును పేర్కొనగా, మిగతా హెడ్ క్వార్టర్లన్నీ ప్రతిపాదిత పోలీసు యూనిట్ల కేంద్రాల్లోనే ఉండడం గమనార్హం.