ఖమ్మం నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగారు. ఒకరినొకరు తిట్టి పోసుకుంటున్నారు. చోర్… బడా చోర్… ఉల్టా చోర్.., బళ్లారి బడా చోర్… బద్మాష్… అంటూ పరుష పదజాలంతో పరస్పరం దూషించుకుంటూ ‘తవ్వు’కుంటున్నారు. ఓ భూవివాద ఘటనతో మొదలైన ‘రియల్’ వ్యాపారుల పంచాయితీ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయా వ్యాపారులు అప్ లోడ్ చేస్తున్న పోస్టులు సర్వత్రా చర్చకు దారి తీస్తున్నాయి. ‘రియల్’ వ్యాపారుల ఘర్షణకు సంబంధించి స్వల్పంగా ఎడిట్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను దిగువన మీరూ చదవవచ్చు.
ఉల్టా చోర్..బడా చోర్..
ఎవర్రా కబ్జా దార్
………………….
నేను రియల్ ఎస్టేట్ రంగంలో నిలబడి ముప్పై ఏళ్లు. ఏ రోజన్నా చిన్న మచ్చ ఉందా.. ముప్పై ఏళ్ల క్రితం పట్టణానికి ఇప్పటి నగరానికి ఏమన్నా పొలిక ఉందా.. నగరం పెరిగితే అది నా తప్పా.. రోడ్డు వెడల్పైతే అది నా తప్పు కాదు కదా… నీలాగా అసైన్మెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ కబ్జా చేసి దర్జా వెలగబెట్టట్లేదు. నిజాయితీ వ్యాపారం నన్ను నిబెట్టింది. తుళ్లి తుళ్లి పడకు, ఒకప్పుడు మింగ మెతుకుల్లేని నీ గతుకుల బతుకు కాదు నాది. దొంగ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన చరిత్ర నీది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, పసి పిల్లాడిని పొట్టన పెట్టుకుని కన్నతల్లికి కడుపుకోత పెట్టిన చరిత్ర నీది. దళిత, బహుజన, బడుగు బలహీన వర్గాల బిడ్డల భూముల పై కన్నేసి కబ్జా చేసి పాపపు సొమ్ము మింగిన ఘనత నీది. ఐరన్ షాపు వాళ్లను, సిమెంట్ షాపు వాళ్లను, బ్లాక్ మెయిల్ చేసి అపార్ట్మెంట్లు కట్టించి, వాటిని కొన్న వాళ్లు సగం డబ్బు కడితే మెలిక పెట్టి రిజిస్టర్ చేయనంటూ ఎగనామం పెట్టి డబ్బు మింగిన నీచపు చరిత్ర నీది. మూడు జిల్లాల్లో ముళ్ల కంచె వేసుకొని కబ్జారాయుడుకి మారు పేరుగా తిరుగుతున్న నన్ను కబ్జాదార్ అంటావా.. ఒక్క కబ్జా చూపించు.. నా మీద సోషల్ మీడియాలో నా ఫోటో పెట్టి దుష్ప్రచారం చేయడమే కాకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే ——గారికి మకిలి అంటించాలని చేసే ప్రయత్నాన్ని న్యాయ స్థానంలో సవాలు చేయబోతున్న.. కోటి రూపాయల పరువు నష్టం దావా వేసి నా నిజాయితీని నిరూపించుకుంటాను. సోషల్ మీడియాలో నాపై పోస్టులు పెట్టిన ఏ ఒక్కరినీ ఒదలను. ఈ పాపిష్టి ముఠా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎవరు చెప్పినా ఖాదర్ చేయకుండా తుళ్ళితుళ్లి పడుతున్న ముఠా పట్ల జాగ్రత్తగా ఉండండి. అసైన్మెంట్ ల్యాండ్‌ను పట్టా భూములని చెప్పి అంటగడుతున్నారు.
మీ మందడపు మాధవరావు,
రియల్ వ్యాపారి, ఖమ్మం
బళ్లారి బడా చోర్ ఎవరు…
నలుగురు భాస్కరుళ్లని తయారు చేసిన నల్లపూస ఎవరు…చిప్పకూడు తిన్న బద్మాష్ ఎవరు….
తన ఎదుగుదల కోసం…ఎస్సీ,ఎస్టీలను బలి చేసింది ఎవరు…
మంచు కొండను …ముంచింది ఎవరూ….
భూ ఆక్రమణల అనకొండ…
మందగనపు మదం ఎవరికి తెలియదు…
గురిగింజ సామెత నవ్వి పోదు..
——కి మకిలి అంటించింది ఎవరు….
మనిషిగా పుట్టినప్పుడు సహయం చేయకపోయినా పర్వాలేదు… ఎదుటోడి సొమ్మును గుంజుకునే నీచ సంస్కృతి నీది…2004 నుంచి నీ అరాచక ఆక్రమణలకు ఎందరో సామాన్యులు బలి అయ్యారు.. ——– వెంచర్ ను తలో దిక్కుగా మార్చి వందలాది అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన దగాకోరువు నువ్వు…. రాజకీయ అండతో అరాచకానికి పాల్పడింది నువ్వు…
మీసాలకు సంపెంగ నూనె కోసం మీ అన్నదమ్ములు ఎందరికి బ్లేడ్ వేసారో రఘునాధపాలెం ప్రజలకు తెలుసు…సమాచార హక్కు చట్టం పేరుతో పెద్దన్న పాత్ర పోషించిన మీ సోదరద్వయం అధికార, అనధికారుల జేబులు కొట్టింది వాస్తవం కాదా..
బ్లాక్ మెయిల్ మీ ఇంటి పేరుగా మార్చుకుని ఎన్ని కుటుంబాలను రోడ్డున పడవేసారో మండల ప్రజలకు తెలుసు…
ఖమ్మం కబ్జాలు సరిపోవని జిల్లాలు, రాష్ట్రాలు దాటి భూ బాగోతాలకు పాల్పడి.. జైలు కూడు తిన్నది మరిచారా…
బళ్లారి భాధితులు బస్సులు ఏసుకొచ్చి రచ్చ చేసింది మర్చిపోయావా…..
బళ్లారి భాధితుల ఉసురు నీ కుటుంబానికి తగలింది మర్చపోయావా…..
ల్యాండ్ సెటిల్ మెంట్ అంటూ కోట్ల రూపాయల వసూలు చేసి..ఎందరినో బలి చేసింది మీరు కాదా….
చేతగాని మాటలతో వివాదాస్పద భూములను కబ్జా చేయలేదా…
గురిగింద సామెత…మీ అక్రమాలను చూసి నవ్వు కోదు..
నర్సంపేటలో గ్రీన్ బెల్ట్ ను…రీ ప్లాటింగ్ చేసిన ఘనులు మీరు..
అచ్చంపేట, కల్వకుర్తిలో నీ చెంచాలు ప్రజలను పుట్టి ముంచింది నిజం కాదా….
ఉన్నది లేనట్టు…లేనిది ఉన్నట్లు మీరు చేసే కనికట్టు ఎవరికి తెలియదు….
బడా చోర్…బద్మాష్ వేషాలు వేస్తూ… అందరినీ బుట్టలో వేసుకుని సన్నాయి నొక్కులు నొక్కడం జిల్లాలో మీ తర్వాతే సుమా….
క్రీము లేకుండానే ఐస్ క్రీం బాబాలు ఎవరో తెలియదా నాయనా…