ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరిచిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మార్కెట్ స్తంభించిపోయిందని, ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ప్రతి ప్రయివేట్ ఉపాధ్యాయునికి ఉచిత రేషన్‌తోపాటు రూ.7,500 ఆర్థిక సాయం అందించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
వీలైతే రేపు విద్యాశాఖ కార్యదర్శిని కలుస్తామని ఆయన చెప్పారు. అంతేగాక ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందన్నారు. కళాశాలల మాదిరిగా పాఠశాల విద్యార్థులకు కూడా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వాలన్నారు.