ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని ముంబయి, రాయగఢ్ లకు చెందిన పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్ల క్రితంనాటి ఘటనలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. ఓ ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే అభియోగాలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
2018లో కాన్కార్డ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అర్నబ్ గోస్వామిపై ఐపీసీ సెక్షన్ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో రాయిగఢ్, ముంబయి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఏపీఐ సచిన్ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసింది.
కాగా ఆర్నబ్ అరెస్టును కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఆయన అభివర్ణించారు.