ఔను… తెలంగాణా కొత్త సచివాలయ నిర్మాణపు పనుల టెండర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ, పల్లోంజీ సంస్థ దక్కించుకుది. మొత్తం రూ. 494 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని నిర్ణయించిన సచివాలయ పనులను దక్కించుకునేందుకు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలైన షాపూర్ జీ-పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలు తీవ్రంగా పోటీ పడ్డాయి.
టెండర్ల ప్రక్రియలో షాపూర్ జీ-పల్లోంజీ సంస్థ ఎల్-1గా నిలిచింది. అంచనా వ్యయపు మొత్తానికి 4 శాతం అధిక ధరలను కోట్ చేసి షాపూర్ జీ-పల్లోంజీ సంస్థ పనులను దక్కించుకోవడం విశేషం. అంటే అంచనా వ్యయానికి మరో రూ. 19.76 కోట్ల అదనపు మొత్తాన్ని ఈ సంస్ధ కోట్ చేసింది. పనులను దక్కించుకునేందుకు ప్రయత్నించిన ఎల్ అండ్ టీ సంస్థ 4.8 శాతం మొత్తాన్ని అదనంగా కోట్ చేయడంతో ఎల్-1గా షాపూర్ జీ-పల్లోంజీ సంస్థ నిలిచింది.
దీంతో నిర్మాణపు పనులను షాపూర్ జీ-పల్లోంజీ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రోడ్లు, భవనాల శాఖ షాపూర్ జీ-పల్లోంజీ సంస్థకు గురువారం అంగీకార పత్రాన్ని ఇచ్చింది. పన్నెండు నెలల్లో కొత్త సచివాలయ నిర్మాణపు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం టెండర్ ప్రక్రియలో షరతు విధించింది. కొత్త సచివాలయ పనులను షాపూర్ జీ-పల్లోంజీ సంస్థ దక్కించుకుందని ts29 నిన్ననే వార్తా కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయ టెండర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి అధికారిక ప్రకటనను దిగువన చూడవచ్చు.
Government of Telangana has sanctioned Rs. 617.00 crores for the Construction of New Secretariat Complex in the State of
Telangana vide G.O.Ms. No. 47, TR&B Dept. dated 10.09.2020.
Subsequently tenders were invited on e-procurement platform participated to seek clarifications
to be received from 30.09.2020 to 20.10.2020. During the pre-bid meeting held on 07.10.2020 the following five contractors
- M/s KCP Projects Pvt Ltd.
- M/s JMC Projects.
- M/s TATA Projects Ltd.
- M/s NCC Ltd.
- M/s. Shapoorji Pallonji And Company Pvt Ltd.
The technical bids were opened on 20.10.2020 and found that
two bidders have participated in the tender process. Both the
bidders were technically qualified and their financial bids were opened on 23.10.2020. The details of the bidders and their quoted rates are as below:
- M/s Larsen & Toubro Limited, Chennai quoted 4.8% excess 2. M/s. Shapoorji Pallonji And Company Private Limited, Mumbai quoted 4.02% excess
The bids were submitted to the Commissionerate of Tenders and in the meeting held on 28.10.2020, the lowest qualified tender of M/s Shapoorji Pallonji And Company Private Limited, Mumbai was approved @ 4.02% excess over the estimate contract value of Rs 494.86 Cr.
The Letter of Acceptance is issued to M/s Shapoorji Pallonji And Company Private Limited on 29.10.2020.