మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పబోతున్నారు? ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘దేశ ప్రజలతో ఈరోజు సాయంత్రం ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ప్రధాని ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారనే విషయం మాత్రం ఆయా పోస్టులో లేకపోవడమే ఉత్కంఠను కలిగిస్తోంది.
దసరా దీపావళి పండుల సందర్భంగా ప్రధాని ఏదేని ముఖ్య విషయాన్ని చెబుతారా? లేక కరోనా వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటన చేస్తారా? చైనా వివాదాంశంపై మరేదైనా సంచలన నిర్ణయాన్ని వెల్లడిస్తారా? అనే అంశాలను ఉటంకిస్తూ భిన్న వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా మరికొద్దిసేపట్లోనే ప్రధాని ఏం చెప్పబోతున్నారనే అంశంపైనే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
UPDATE:
కరోనా వైరస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ఈ రోజు సాయత్రం జాతినుద్ధేశించి మోదీ ప్రసంగిస్తూ, నవరాత్రులు, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా మరింత జాగ్రత్త వహించాలన్నారు. కరోనా తగ్గిందనే భావన రానీయవద్దని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే చివరి వ్యక్తి వరకు దాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.