ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ మద్ధతు ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమ పార్టీ కోదండరాంకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావులు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.అదేవిధంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో పోటీ చేస్తున్న కె. నాగేశ్వర్ కు మద్ధతునిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాస్వామిక ఉద్యమాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కోదండరాం, నాగేశ్వర్ లకు సంపూర్ణ మద్ధతునిచ్చి గెలిపించాల్సిందిగా వారు కోరారు.