భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయమైంది. నగరంలో దాదాపు 1,500 కాలనీలు నీట మునిగినట్లు తెలుస్తోంది. ఆయా కాలనీల్లో నడుం లోతు వరకు వరద నీరు చేరినట్లు సమాచారం. పలు కాలనీల్లో, వీధుల్లో బోట్ల సాయంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకావం ఉందని, కనీసం మూడు రోజులపాటు ప్రజలు బయటకు రావద్దని అధికారగణం హెచ్చరించింది.
కాగా ఎమర్జెన్సీ సేవల కోసం 040 – 211111111, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.