దీని మీనింగేంటి లాయరూ?
మనం వాళ్ల శత్రువులమని ప్రపంచానికి చాటి చెప్పడం.
దాని వల్ల… ఆళ్లకేంటి లాభం?
హహ్హ.. హహ్హ… ఒక ఎలకా.. మా ఇంట్లో పిల్లి ఉందని చెప్పిందనుకోండి. అది చచ్చిపోతే అందరికీ పిల్లిమీదేగా అనుమానం వస్తుంది?
అంటే మనమీదన్నమాట. మరి పిల్లి ఏం చేయాలి? నాన్ వెజిటేరియన్ తినడం మానేయాలా?
అక్కర్లేదు… డైరెక్టుగా చంపకుండా, ఏ మందో పెట్టి చంపొచ్చు.
అయితే… కత్తి మనదైనా, చెయ్యి మనది కాకూడదంటావ్? మన మీదకు రాకూడదు.. మల్లీశ్వరి ఉండకూడదు.. రేయ్ బాబీ…? ఈ కత్తికి ఒక ఆర్గండి చీర, కాటన్ జాకెట్ కొనిపెట్రా…
ఎందుకు సార్?
తుఫాను హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. అది ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకొచ్చు.
బాగుంది కదా సంభాషణ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమాలో విలన్ పాత్రధారి కోట శ్రీనివాసరావు, లాయర్ పాత్ర పోషించిన దేవదాస్ కనకాల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన డైలాగ్స్ ఇవి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఆయా డైలాగులు చిత్రంలో బాగా పేలాయ్ కూడా.
యూ ట్యూబ్ లో ఏదో సెర్చ్ చేస్తుండగా ఈ సినిమా దృశ్యాలు సాక్షాత్కరించాయి. బాగుందనిపించింది. ఆయా సంభాషణను ఇతరత్రా ఏ వర్తమాన అంశానికీ అన్వయించుకోరాదని మనవి చేయనైనది. సినిమా సీన్లుగా మాత్రమే పరిగణించి, ఆస్వాదించాలని ప్రత్యేకంగా కోరనైనది.