ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తూ తెలంగాణా మున్సిపల్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు అంటే ఈనెల 15వ తేదీలోపు ఆస్తుల నమోదు అసాధ్యమని మున్సిపల్ శాఖ భావించినట్లుంది. అందుకే కాబోలు ‘వ్వవసాయేతర ఆస్తుల వివరాలను దయచేసి మీరే నమోదు చేసుకోండి’ అంటూ ధరణి పోర్టల్ కు సంబంధించిన వెబ్ లింకును మున్సిపల్ విభాగం ప్రజలకు షేర్ చేసింది. ఈమేరకు గురువారం అర్థరాత్రి దాటాక పురపాలక, నగర పాలక సంస్థల్లో నివసించే ప్రజల ఫోన్లకు మెసేజ్ ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ వెబ్ లింకును పంపించడం గమనార్హం.