ఈ వాదన హత్యలను సమర్ధించడం కాకపోవచ్చు. కన్నకూతుళ్లపై తండ్రుల గుండె లోతుల్లోదాగిన మమకారాన్ని ఆవిష్కరించే యత్నంలా కనిపించింది. చట్టం వేరు, ప్రేమ, ఆప్యాయతలు వేరు. వాదనలో అర్థముందా? అది అర్థరహితంగా ఉందా? అనే తర్కాన్ని వదిలేస్తే… ఆడకూతుళ్లపై తండ్రుల ప్రేమను, ఆప్యాయతను, వారి ఎదుగుదలకు పడే శ్రమను రచయిత ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ వాదన ద్వారా నేర ఘటనలను సమర్ధించడం ఎంతమాత్రమూ కాదు. కాకపోతే తండ్రుల ప్రేమను ప్రస్ఫుటింపజేస్తూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ వాల్ పై ఇలా రాసుకున్నారు. అక్కడక్కడా అక్షర దోషాలను సవరించిన ఆయా పోస్టును ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదవండి.
కచ్చితంగా ఎన్కౌంటరో, ఉరి తీసి చంపేయాల్సిందే..
లేకపోతే..
>>> మీరు పుట్టినప్పుడు అందరూ ఆడపిల్ల పుట్టిందా? అని అంటుంటే మా అమ్మ, మా బంగారం అంటూ ముద్దాడాడు చూడు… అందుకు ఎన్కౌంటర్ చేయాలి నా కొడుకుని.
>>>> మీ కోసం ఫిక్సడ్ డిపాజిట్లు చేసి, భూములు కొనుగోలు చేసి మీ పేరు మీద ఉంచాడు చూడు… అందుకు విషం ఇచ్చి చంపాలి.
>>>>> మీరు సైకిల్ నేర్చుకుంటుంటే, ఎక్కడ పడిపోతావోనని, మీ వెంబడి పరుగెత్తుతాడు చూడు…
అందుకే కాళ్ళు నరికిపారేయాలి నా కొడుకుని.
>>>>> మీ కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇంజనీరింగ్ ఫీజుల కోసం లక్షలు అప్పు చేశాడు చూడు… అందుకు కొట్టి చంపాలి ఎదవని.
>>>>> కొడుకుని కాళ్లదగ్గర, మిమ్మల్ని బుజాలపై పెట్టుకున్నాడు చూడు… అందుకు అడ్డంగా నరకాలి దద్దమ్మని.
>>> మీ పెళ్లికి ఆకాశమంత పందిరేసి, భూమంతా వేదిక వేసి, అందరిని పిలిచి గర్వంగా పెళ్లి చేయాలనుకుంటాడా పిచ్చి సన్నాసి? కరెంట్ షాక్ ఇచ్చి చంపాలి పిచ్చోన్ని.
>>>>> మీరు ఎవరినో తీసుకొచ్చి నా భర్త అని, వానితో లేచిపోతే, మీ అమ్మాయి లేచిపోయిందంట కదా? అని అందరూ అవమాన పరుస్తుంటే, పులి లాంటి మీ నాన్న, తల దించుకొని వెళుతున్నాడు కదా… అందుకు తల నరకాలి వాన్ని.
>>> పుండు మీద కారం చల్లినట్టు, అతని ముందే నీ భర్తతో తిరుగుతుంటే, ఏమీ చేయకుండా ఉంటాడా ఆ సోంబేరి? థూ… వాని బతుకు చెడ!
>>>>> చివరిగా మిమ్మలి వదిలేసి, మీ కారణంగా మరో తల్లితండ్రులకు కడుపుకోతకు సిద్ధపడ్డాడు,
అక్కడా మీ మీద పిచ్చి ప్రేమే ఎదవకి…. తూట్లు తూట్లుగా కాల్చి చంపాలి అలాంటి నాన్నను.
థూ… అలాంటి తండ్రుల బతుకు చెడ….
✍️ రామకృష్ణ మల్లిఖార్జున