థింక్ డిఫరెంట్ అంటుంటాడు అదేదో సినిమాలో కమెడియన్ వేణుమాధవ్. అంటే అందరూ ఆలోచించే ధోరణికి వ్యతిరేక దిశలో బుర్రకు పని చెప్పాలంటూ తన ‘ఇజ్జత్’ తానే తీసుకుంటూ కడుపుబ్బా నవ్విస్తుంటాడు వేణు మాధవ్ ఆ చిత్రంలో. అది సినిమా సన్నివేశం. ప్రేక్షకులను నవ్వించడానికి రచయితలు ఇటువంటి హాస్య సీన్లు తమకు తోచిన రీతిలో అల్లుతుంటారు.
కానీ వాస్తవిక పరిస్థితుల్లోనూ చాలా మంది తాము భాషా పండితులమని భ్రమిస్తుంటారు. తెలుగు పదాలను తామే కనిపెట్టామనే రీతిలో గొప్పలు పోతుంటారు. అయితే అది భాషా కాదు, యాస అంతకన్నా కాదనే విషయం తేటతెల్లమై నలుగురిలో నవ్వుల పాలవుతుంటారు. ఇదీ అటువంటి ఘటనే. ఇంతకీ విషయమేంటంటే…
ఇదేదో ‘మణికంఠ ట్రేడర్స్’ అంట. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో దీన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించినట్లున్నారు. అదే విషయాన్ని షాపు నిర్వాహకులు ప్రజల్లో గొప్పగా చెప్పాలని భావించారేమో. కరపత్రాలు ప్రచురించి మరీ పంచేస్తున్నారు. కాకపోతే సదరు షాపును మంత్రి హరీష్ రావు ప్రారంభించడమే పాపమైందనే భావన కలిగే విధంగా… ఓ ‘ఘోర’ తెలుగు పదాన్ని ఆయన హస్తాలకు ఆపాదిస్తూ కరపత్రంలో వాడడమే దారుణం. దీంతో ఆయా షాపు యజమానిపై సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. అదేమిటో దిగువన మీరే చదవండి.
శుభసాయంత్రం మిత్రులారా…
అమృత హస్తాలతో అనడం రొటీన్ అనుకున్నాడేమో ఈ దుకాణం యజమాని… కాస్త వెరైటీగా ఉంటుందని కబంధ హస్తాల్లో అనే పదం వాడాడు.. కాస్తంత అర్థం చేసుకోండి!