ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో అనూహ్య పరిణామం. అశ్వత్ధామరెడ్డి లేకుండానే హబ్సిగూడలో టీఎంయూ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. టీఎంయూ అధ్యక్షుడు థామస్ రెడ్డి వర్గం ఈ సమావేశాన్ని నిర్వహించి అశ్వత్థామరెడ్డి వైఖరిని తప్పుపట్టింది.
కార్మికుల బాగోగులను అశ్వత్థామరెడ్డి పట్టించుకోవడం లేదని, సమ్మె తర్వాత నుంచి ఆయన యూనియన్‌కు దూరంగా ఉంటున్నారని థామస్ రెడ్డి ఆరోపించారు. కార్మికులను విస్మరించిన వ్యక్తి పదవిలో ఉండటం సబబు కాదని, అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అశ్వత్థామరెడ్డి బీజేపీలో పదవులు ఆశిస్తూ ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. అశ్వత్ధామరెడ్డి లేకుండా థామస్ రెడ్డి టీఎంయూ సమావేశాన్ని నిర్వహించిన ఘటనపై యూనియన్ చీలికగా వార్తలు వస్తుండడం గమనార్హం.