నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇంచార్జిలను నియమించారని పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నియమకాలను కేటీఆర్ ప్రకటించినట్లు ఆయన చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, ఇతర నేతలందరితో చర్చించిన కేటీఆర్ ఆయా ఇన్ చార్జీల పేర్లను విడుదల చేయాలని సూచించారని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఆయా ఇన్ఛార్జీలు ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీ తో గెలిపించడానికి కృషి చేస్తారని చెప్పారు.
నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జీల వివరాలు:
కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ , బోయినపల్లి వినోద్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు- వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యా సంస్థలు, ఉద్యోగ సంఘాలు
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ – జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు
పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ -స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం
బోడకుంటి వెంకటేశ్వర్లు, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ -పరకాల, వర్దన్నపేట నియోజకవర్గాలు
పసునూరి దయాకర్, ఎంపీ, కె.వాసుదేవరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ – భూపాలపల్లి నియోజకవర్గం
మాలోతు కవిత, ఎంపీ, నాగూర్ల వెంకన్న, రైతు విమోచన సంస్థ చైర్మన్ – నర్సంపేట, ములుగు నియోజకవర్గాలు
బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి, మార్నేని రవిందర్ రావు, డీసీసీబీ చైర్మన్ – మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు
మెట్టు శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి – మహబూబాబాద్ నియోజకవర్గం