భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ సునీల్ దత్ కథనం ప్రకారం… గురువారం ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు పాల్వంచ రిజర్వు అటవీ ప్రాంతంలో జిల్లా పోలీస్ పార్టీలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులపై కాల్పులకు పాల్పడ్డ మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించి ఒక SBBL తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్పీ సునీల్ దత్ వివరించారు.
ఫొటో: పాల్వంచ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనా స్థలిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి