తాబేలును మింగలేక, ఇక నావల్ల కాదంటూ మొసలి వదిలేస్తే ఎలా ఉంటుంది? సాలీడు పురుగు ఏకంగా ఓ పక్షిని మింగేస్తే నమ్మగలమా? సీగల్ అనే పక్షి ఏకంగా ఎలుకను మింగేస్తే మరెలా ఉంటుంది? శరీరం బొరియలా మారిన ఓ పురుగు సజీవంగా కదలాడుతూ తన జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్న దృశ్యం కళ్ల ముందు కనిపిస్తే…? ఇవన్నీ నమ్మదగిన అంశాలేనా? ప్రకృతిలో ఇలా కూడా ఉంటుందా? అని ప్రశ్నించకండి.
‘నేచర్ ఈజ్ స్కేరీ’ అనే ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఆయా వీడియోలు ప్రకృతి భయానకమనే అంశాన్ని కూడా బోధపరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్విట్టర్ అకౌంట్ లోని పలు వీడియోలు వైరల్ గా మారడం విశేషం. అమెరికా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే అవాకులారియా అనే జాతికి చెందిన సాలీడు చనిపోయిన ఓ పక్షిని మింగడం, నోట చిక్కిన తాబేలును మింగలేక ఓటమికి అంగీకరిస్తూ మొసలి దాన్ని వదిలేయడం వంటి వీడియో విజువల్స్ చూశాక ‘నేజర్ ఈజ్ స్కేరీ’… అంటే ప్రకృతి భయానకంగా ఉందని అంగీకరించక తప్పదేమో! ఆయా ఆసక్తికర వీడియోలను దిగువన మీరూ చూసేయండి.