నిజామాబాద్ జిల్లాలో కేంద్ర నిధులతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవాల తీరుపై కలెక్టర్ ను ఉటంకిస్తూ బీజేపీకి చెందిన స్థానిక పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇదే సందర్భంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను పరోక్షంగా ఉటంకిస్తూ ఘాటైన పదజాలపు వ్యాఖ్యలు చేశారు.
‘ఆర్మూర్ పండు, బాల్కొండ జాంపండు’ అంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సొమ్మొకడిది, సోకొకడిది’గా అభివర్ణిస్తూ ప్రారంభోత్సవాల తీరుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘పొద్దున లేవంగనే ఖద్దరు బట్టలు ఇస్తిరి జేసుకుని, మీద గులాబీ కండువలు గప్పుకుని, పోడరేసుకుని పింకీలంత తయారైనారు… రిబ్బన్లు కట్ జేయనీకి?’ ఇదేనా పద్ధతి? అని ప్రశ్నించారు.
కలెక్టర్ గారూ! దయచేసి ఇవన్నీ ఆగిపోవాల… అంటూ ఎంపీ అర్వింద్ తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేసిన ఆయా సంచలన వ్యాఖ్యల వీడియోను దిగువన చూడవచ్చు.