కేంద్ర మంత్రి పదవికి హరి సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈమె ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖకు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హరి సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్, సిమ్రత్ భర్త అయినటువంటి సుఖ్ బీర్ సింగ్ బాదల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే సిమ్రత్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం కేంద్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. అయితే తాము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు కొనసాగిస్తామని, కానీ రైతు వ్యతిరేక రాజకీయాలను సహించబోమని సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేయడం గమనార్హం.