కరోనా మహమ్మారి ఓ పార్లమెంట్ సభ్యున్ని బలి తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ (64) కరోనాతో కొద్ది సేపటి క్రితం మరణించారు. కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన ఎంపీ దుర్గాప్రసాద్ చెన్నయ్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.