తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఓ పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని గదిరాస్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న శివానంద్ అనే ఏఎస్ఐ సీర్పీఎఫ్ విభాగపు అధికారి. అయితే కొద్దిసేపటి క్రితం శివానంద్ తన సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానిక పోలీసులను తీవ్ర విషాదంలో ముంచింది. శివానంద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు.