నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయా? రానున్న రెండు రోజుల్లోనే ప్రస్తుత సమావేశాల నిర్వహణను ముగించబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమైన రెవెన్యూ బిల్లుతో పాటు ఇంకా అనేక బిల్లులు అటు అసెంబ్లీలో, ఇటు శాసన మండలిలో ఆమోదం పొందాయని, చర్చించాల్సిన ప్రజా సమస్యలు కూడా పెద్దగా లేవనే వాదన వినిపిస్తోంది. గత 7వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను ఈనెల 28వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సభలో ప్రవేశపెట్టిన బిల్లుల ఆమోదం అత్యంత వేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో రానున్న రెండ్రోజుల్లోనే, షెడ్యూల్ కన్నా ముందే సమావేశాలను ముగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం శాసనస సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో చేపట్టిన ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల సమస్యలు, కారుణ్య నియామకాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, కారుణ్య నియామకాలను అర్హతలను బట్టి భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. అనంతరం సభలో జీరో అవర్ కొనసాగింది. ఆ తర్వాత పలు బిల్లులపై సభలో చర్చ జరగ్గా, ఆయా శాఖల మంత్రులు బిల్లులపై వివరణ ఇవ్వడంతో సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.
ఇవీ నేటి సభలో ఆమోదం పొందిన బిల్లులు:
1. ప్రభుత్వ నియామకాల పదవీ విరమణ వయోపరిమితి చట్ట సవరణ బిల్లు.
2. విపత్కర వేళ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత బిల్లు.
3. ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లు.
4. భవన నిర్మాణ అనుమతులు, స్వీయ ధృవీకరణ బిల్లు(టీఎస్ బీపాస్).
5. ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు.
6. సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు.
7. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు.
8. కోర్టు ఫీజులు, సూట్స్ వ్యాలుయేషన్ చట్ట సవరణ బిల్లు.
శాసన మండలిలో నాలుగు బిల్లులకు అమోదం:
1)తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ఆమోదం.
2)తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్ 2020 ఆమోదం.
3) తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు ఆమోదం.
4) పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్