1. మెట్లెక్కడం కష్టమనుకొని,
లిఫ్టును కనుక్కున్న మనిషి
దాన్ని ఎక్కడం అలవాటు పడ్డాక,
పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికై
చివరకు మళ్లీ మెట్లే ఎక్కుతున్నాడు !!
2. నడక కష్టమనీ, కారును తయారు చేసుకుని,
ఆ కారును వాడటం మొదలెట్టాక,
లావెక్కిన శరీరాన్ని.. తగ్గించు కోవడానికై,
వాకింగ్ చేస్తూ మళ్లీ రోడ్డున పడ్డాడు మనిషి !!
3. హరిత విప్లవం అంటూ రసాయన ఎరువుల్ని వాడి
ఎక్కువ పంటలు పండించానని గర్వ పడేలోగానే,
వాటి దుష్ప్రభావం తెలుసుకున్న మనిషి,
మళ్లీ ఎరువుల్లేని (ఆర్గానిక్) ఎవుసం చేస్తున్నాడు !!
4. పారిశ్రామిక విప్లవంతో
ఏదో సాధించాననుకున్న మనిషి,
తను నాశనం చేసిన ప్రకృతిని బ్రతికించు కోవడానికి
మళ్లీ పర్యావరణ మంత్రం పఠిస్తున్నాడు !!
5. పిజాలు, బర్గర్లు అంటూ వెంపర్లాడిన మనిషి,
కరోనా పుణ్యమా అని ఆరోగ్యకరమైన
ఇంటి తిండికే మళ్లీ అలవాటు పడుతున్నాడు !!
6. ఇంతకాలం ఇంగ్లీష్ మందులంటూ,
జిమ్ములంటూ పరిగెత్తిన మనిషి
కరోనా నుంచి రక్షణకై మళ్లీ యోగా, ప్రాణాయామం,
ఆయుర్వేదం అనడం నేర్చుకుంటున్నాడు !!
7. ఉమ్మడి కుటుంబాలను చీదరించుకుని,
చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్న మనిషి
మళ్లీ అంతా కలిసుందాం రా అంటూ
పాత బంధాల వైపే మొగ్గు చూపుతున్నాడు !!
8. పడుచు పిల్లలాంటి పట్నం మోజులో పడి
తల్లి లాంటి పల్లెను మరచిన మనిషి,
కరోనా భయంతో, ఫామ్ హౌజుల పేరిట,
పచ్చని ప్రకృతి కొరకై
మళ్లీ పల్లె బాట పట్టాడు !!
(ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి!)
(సోషల్ మీడియా పోస్ట్ ఇది. బాగుందని స్వేచ్ఛగా వాడేశాం: అజ్ఞాత రచయితకు ధన్యవాదాలతో…)