తెలంగాణాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి-కొత్గూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కొద్దిసేపటి క్రితం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. నిన్న రాత్రి ఇదే మండలంలో నక్సలైట్లు మందుపాతర పేల్చిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల వ్యవధిలో భద్రాద్రి జిల్లాలో జరిగిన రెండో ఎన్కౌంటర్ సంఘటన ఇది. ఈనెల 3వ తేదీన గుండాల మండలం దుబ్బగూడెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు దళనేత శంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా చర్ల మండలంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.