తెలంగాణాలో వీఆర్వోల నుంచి రికార్డులను ఉన్నఫళంగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నుంచి వాట్సాప్ మెసేజ్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి.
Most Urgent
Dear collectors
Greetings.
1. All records original/ photocopies need to taken over from VROs at once .
2. All this has to be completed by 3 PM today.
3. Handing over format follows.
4. Report / certificate from Collectors by 530 PM.
Pl acknowledge and report.
Best wishes & regards.
Somesh Kumar
వీఆర్వోల నుంచి రికార్డుల స్వాధీనపు ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకల్లా పూర్తి చేయాలని, సాయంత్రం 5.30 గంటలకల్లా అందుకు సంబంధించి తనకు నివేదించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనపు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.