ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా అడవుల్లో మావోయిస్టు పార్టీ నక్సల్స్, పోలీసుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. గత రాత్రి పొద్దుపోయాక జరిగినట్లు పేర్కొంటున్న ఈ ఘటనలో నక్సలైట్లు పెద్ద సంఖ్యలో మరణించారనే వార్తలు వస్తున్నాయి,
ఛత్తీస్ గఢ్ మీడియా కథనం ప్రకారం… ఆ రాష్ట్ర డీఆర్జీ జవాన్లు నక్సలైట్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సుక్మా జిల్లాలోని చండమెట అటవీ ప్రాంతంలో తారసపడిన నక్సలైట్లను డీఆర్జీ జవాన్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఇరువర్గాల మధ్య పరస్పరం భీకర కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో నక్సలైట్లకు చెందిన సామాగ్రిని పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లు కూడా పెద్ద సంఖ్యలోనే చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ అనంతరం డీఆర్జీ జవాన్లు ప్రస్తుతం తిరిగి వస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఎన్కౌంటర్ సంఘటనను బస్తర్ ఐజీ ధృవీకరించారు.