‘పియతూ… అబ్ తో ఆజా…’ అంటూ ఇద్దరు వృద్ధ మహిళలు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అదీ నడి వీధిలో…? ఇదిగో ఇలా ఉంటుంది. చుట్టూ జనం ఉన్నారని వీళ్లు గమనించారో లేదోగాని… నడివీధిలో ఆ ఇద్దరు ముసలమ్మలు చేసిన డాన్సుకు సంబంధించిన 15 సెకన్ల నిడివి గల వీడియో మాత్రం ప్రస్తుతం ట్విట్టర్ ను ఊపేస్తోంది.
‘కారవాన్’ మూవీలో ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను ఆశా భోస్లే ఆలపించారు. ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ ఇద్దరు వృద్ధ మహిళల డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ నడివీధిలోని ఈ డాన్స్ సీన్ ఎక్కడిదనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు. అయితేనేమి…?ట్విట్టర్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్న వృద్ధ మహిళల డాన్స్ వీడియోను దిగువన మీరూ చూసేయండి.