సహజ కవి పోతన జన్మస్థలమైన బమ్మెరను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. గురువారం సహజ కవి బమ్మెర పోతనామాత్యుడి జయంతి సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. మహా భాగవతం రచించిన, తెలుగు వారు గర్వించదగ్గ మహాకవి బమ్మెర పోతనగా ఎర్రబెల్లి పేర్కొన్నారు.
పోతన జన్మించిన గ్రామం బమ్మెర తన నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టమని, ఇంత చారిత్రాత్మక, కవితాత్మక, తెలుగుని ప్రపంచ భాషగా నిలిపిన ప్రముఖులు ఉన్న ప్రాంతం తన నియోజకవర్గంగా చెప్పారు. పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సీఎం కేసీఆర్ టూరిజం హబ్ చేయాలని నిర్ణయించారన్నారు.
ఈ మేరకు రూ.25కోట్ల నిధులను కూడా మంజూరు చేశారని, సీఎం కేసిఆర్ గారి ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.